సూర్యుడిపై పరిశోధన కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వీ సి-57 ఉపగ్రహ వాహక నౌక ఆదిత్య ఎల్-1 ను మోసుకెళ్లింది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్వేజ్ పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్ -1 చేరుకోవడానికి 125 రోజులు పడుతుంది.
భానుడి ఎల్-1 కక్షలోకి ఇది చేరుకుంటుంది. అనంతరం అందులోని ఏడు పీలోడ్ లు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తాయి. సూర్యుడి పొరలైన ఫొటో స్పీయర్, క్రోమోస్ఫియర్ సహా వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. చంద్రయాన్ -3 తర్వాత ఇస్రో ప్రయోగించిన ఈ మిషన్ పై అందరి దృష్టి ఉంది. కాగా సూర్యుడిపై ప్రయోగాలు చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే.