తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాం..ఆయన వస్తున్నారని తెలిపారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాజకీయ ప్రయాణం ఎటువైపు సాగుతుందని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది. ఈ తరుణంలోనే ఇవాళ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును కలిసారు పొంగులేటి. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ తరుపున తుమ్మలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఏ పార్టీలో ఉన్న నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి తుమ్మల అని కొనియాడారు. కొన్ని శక్తులు పోమనలేక పొగపెట్టి తమను బయటకు పంపిస్తున్నారు. మీ మీద్దరం కూడా అదే కోవలోకి వస్తామన్నారు. బీఆర్ఎస్ కు బలం లేని ఖమ్మం జిల్లాలో తుమ్మల లాంటి వ్యక్తులు పార్టీ బలోపేతానికి కృషి చేసారని వెల్లడించారు. సీఎం అపాయిట్ మెంట్ కూడా దొరకని పరిస్థితి అని ఫైర్ అయ్యారు పొంగులేటి.