ఈనెల 26న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ.. గులాబీమయమైన లోహా పట్టణం

-

బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో బలపరచాలనే ఉద్దేశంతో ఆ పార్టీ అధినాయకత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి రైతులకు హామీల వర్షం కుప్పించింది. తాజాగా మరోసారి అక్కడి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కంధార్‌ నియోజకవర్గం లోహా పట్టణంలో ఈనెల 26న బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది.

బీఆర్ఎస్ పార్టీ బహిరంగ నేపథ్యంలో లోహా పట్టణం గులాబీమయమైంది. ప్రధాన రహదారులన్నీ బీఆర్ఎస్ బ్యానర్లు, హోర్డింగులతో ముస్తాబయ్యాయి. బైల్‌ బజార్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం సిద్ధమవుతోంది. బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లను ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు మాణిక్‌రావు కదం, కంధార్‌ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గె, కన్నాడ్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ జాదవ్‌ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలో కాంగ్రెస్‌, బీజేపీ, శివసేన కాకుండా మరే పార్టీ కూడా ఈ స్థాయిలో సభను నిర్వహించలేదు. దీంతో సభా ఏర్పాట్లను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news