యూపీలో స్కూల్ బస్సు- కారు ఢీ.. ఆరుగురు దుర్మరణం

-

స్కూల్ బస్సు-కారు ఢీ కొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గాజియాబాద్​లో మేరఠ్​-దిల్లీ ఎక్స్​ప్రేస్​వేపై చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సహా మహిళలు కూడా ఉన్నారు. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పాఠశాల బస్సు రాంగ్​ రూట్​లో అతి వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. బస్సులో పిల్లలు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. కానీ కారులో ప్రయాణిస్తున్న వారిలో మాత్రం ఆరుగురు దుర్మరణం చెందినట్లు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వివరించారు.

“దిల్లీ-మేరఠ్​ ఎక్స్​ప్రెస్​వేపై ఇవాళ ఉదయం 6 గంటలకు  గాజీపుర్ వద్ద బస్సులో సీఎన్​జీ నింపించుకున్న​ డ్రైవర్ రాంగ్ రూట్​లో వస్తున్నాడు. ఈ క్రమంలోనే మేరఠ్​ నుంచి వస్తున్న ఓ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నాం. బస్సు డ్రైవర్​ రాంగ్ రూట్​లో రావడమే ప్రమాదానికి ప్రధాన కారణం.”

– రమానంద్​ కుశ్వహ, ఏడీసీపీ ట్రాఫిక్​

Read more RELATED
Recommended to you

Latest news