కెనడాకు భారత్ అల్టిమేటమ్.. తెరవెనుక చర్చలకు సిద్ధమన్న ట్రూడో సర్కార్

-

భారత్‌లో పనిచేస్తున్న తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు కేంద్ర సర్కార్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కెనడా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దీనికోసం తెరవెనుక చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.

‘భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల భద్రతను చాలా కీలకంగా పరిగణిస్తున్నాం. భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితి ఇంకా పెరగాలని తమ దేశం అనుకోవట్లేదు.’ అని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య కేసుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తమ దౌత్యవేత్తల భద్రతపై కెనడా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్‌లో కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఒట్టావాకు దిల్లీ మంగళవారం అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 10లోగా దాదాపు 41 మంది అధికారులను వెనక్కి పిలిపించుకోవాలని కెనడా అధికారులకు భారత్ సూచించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news