విష‌మం గానే కెప్టెన్ వ‌రుణ్ సింగ్ ఆరోగ్యం : ఎయిర్ ఫోర్స్

-

త‌మిళ నాడు ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం లో తీవ్రం గా గాయ ప‌డ్డ ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ ఆరోగ్యం ఇంకా విష‌మం గా నే ఉంద‌ని భార‌త ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఆయ‌న ప్ర‌స్తుతం క‌ర్నాట‌క లో ని బెంగ‌ళూర్ లో గ‌ల క‌మాండ్ ఆస్ప‌త్రి లో నే చికిత్స తీసుకుంటున్నాడ‌ని ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఆయన‌కు ఆస్ప‌త్రి లో చికిత్స ఇంకా కొన‌సాగుతుంద‌ని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

అయితే ఆయ‌న త్వ‌ర‌లో నే కోలు కోవాల‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు. అయితే వ‌రుణ్ సింగ్ ప్రమాదం పై ఆయ‌న తండ్రి రిటైర్డ్ క‌ల్న‌ల్ కేపీ సింగ్ స్పందించారు. త‌న కుమారుడు ఒక గొప్ప యోధుడు అని అన్నారు. త‌ను త‌ప్ప‌కుండ మృత్యువు ను జ‌యిస్తాడ‌ని ఆశా భావం వ్య‌క్తం చేశాడు. దేశ ప్ర‌జ‌లు అంద‌రూ త‌న కుమారుడి కోసం ప్రార్థాస్తున్నార‌ని అన్నారు. వారి ప్రార్థ‌న‌లే వ‌రుణ్ సింగ్ ను కాపాడుతాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version