అవన్నీ ఫేక్.. ఆ సోషల్‌ మీడియా ఖాతాలు ఫాలో కావొద్దు: సీబీఎస్‌ఈ హెచ్చరిక

-

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సీబీఎస్ఈ బోర్డు విద్యార్థులకు కీలక హెచ్చరికలు చేసింది. సోషల్ మీడియాలో సీబీఎస్‌ఈ లోగో, పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే నకిలీ హ్యాండిల్స్‌తో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో తమ బోర్డు పేరుతో అనేక నకిలీ ఖాతాలు ఉన్నాయని, వాటిని ఫాలో కావొద్దని సీబీఎస్ఈ బోర్టు కోరింది. ‘@cbseindia29’ హ్యాండిల్‌ మాత్రమే తమదని స్పష్టం చేసింది. ఈ ఖాతాలో వచ్చిన సమాచారం మాత్రమే అధికారికమని విద్యార్థులు గుర్తించాలని పేర్కొంది. ఈ సందర్భంగా 30 నకిలీ ఖాతాల జాబితాను విడుదల చేసిన బోర్డు… బోర్డు పేరు, లోగో పెట్టుకొని ఈ హ్యాండిల్స్‌ నకిలీ సమాచారం వ్యాప్తి విద్యార్థులు, తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై తగిన చర్యలు తీసుకుంటామనన్న సీబీఎస్ఈ బోర్డు.. నకిలీ ఖాతాల్లో వచ్చిన సమాచారానికి తమది బాధ్యత కాదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...