హరీశ్​రావు కాంగ్రెస్​లోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తాం – రాజగోపాల్​ రెడ్డి సెటైర్​

-

అసెంబ్లీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వాక్యాలు చేశారు. ‘బీఆర్ఎస్ లో హరీష్ రావుకు ప్రయోజనం లేదు. ఆయన 25 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తాం. బీఆర్ఎస్ లో చేసిన పాపాలు కడుక్కోడానికే ఆ శాఖ. గతంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇప్పుడు పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారు’ అని విమర్శించారు.

rajagopal reddy on harish rao

ఇది ఇలా ఉండగా… తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల ప్రాజెక్టులపై వాడివేడి చర్చ జరిగింది.ఇక ఈ సభలో కాంగ్రెస్ మంత్రులు, సభ్యులు చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.కాగా ఈ సభలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు అద్భుత ప్రదర్శన చేశారని కేటీఆర్ ప్రశంసించారు. కృష్ణా జలాలు/కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాలు, అబద్ధాలన్నింటినీ ఒంటరిగా తిప్పికొట్టారని ట్వీట్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news