కొనసాగుతున్న రెండో దశ పోలింగ్.. ఇప్పటి వరకు ఓటేసిన ప్రముఖులు వీళ్లే

-

దేశంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్ సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయాన్నే బారులు తీరారు. ఉదయం 10 దాటితే ఎండ ముదురుతున్న నేపథ్యంలో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు తరలి వస్తున్నారు. మరోవైపు పలువురు ప్రముఖులు కూడా ఓటు వేస్తున్నారు.

బెంగళూరులో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. పౌరలందరూ వచ్చి ఓటు వేయాలని పట్టణ ప్రజల ఓటింగ్‌ తక్కువగా నమోదవుతోందని అందరూ వచ్చి తమ హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తి పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లో బీజేపీ నేత వసుంధర రాజే ఓటేశారు. కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన మామయ్యతో కలిసి ఓటు వేయగా.. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వరుసలో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరువనంతపురంలో కేంద్రమంత్రి మురళీధరన్‌, ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌, టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా బెంగళూరులో ఓటు వేశారు. త్రిస్సూర్‌లో ఎన్‌డీఏ అభ్యర్థి, ప్రముఖ నటుడు సురేష్ గోపి ఓటు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news