రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త..అవన్నీ ఇకపై !

-

రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించింది.

ఇందుకు రూ.2 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇప్పటివరకు ఎన్ఎఫ్ సిఏ ప్రకారం, రాయితీ ధరల్లో, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా బియ్యం, గోధుమలు అందిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రెండు పథకాలను విలీనం చేసి అంత్యోదయ అన్న యోజన కిందికి వచ్చే కుటుంబాలకు నెలకు 35 కిలోల చొప్పున, మిగతా వారికి నెలకు తలసరి 5 కిలోల చొప్పున ఉచితంగా వీటిని ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల పడే రూ. 2లక్షల కోట్ల ఆహార సబ్సిడీ భారాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని తీర్మానించినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version