ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టాక్. ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. ఆ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్య యుద్ధం ప్రకటించారు.
దీనిపై ప్రధాని మోడీ చర్చించినా ప్రయోజనం లేకుండా పోవడంతో.. ట్రంప్ నిర్ణయాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే కేబినెట్ మీటింగ్ లో అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ప్రధాన విధాన, పాలన సంబంధిత అంశాలపై చర్చించడానికి ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు మంత్రి మండలి సమావేశాలను నిర్వహిస్తున్నారు.