ఏడు నెలల తరువాత నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్.. విస్తృత స్థాయి సమావేశం

-

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుదీర్ఘ విరామం తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు ఇవాళ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్.. ఆ తరువాత ప్రజల్లోకి రాలేదు. తెలంగాణ భవన్ లో సైతం ఆయన ఎప్పుడూ అడుగుపెట్టలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో అప్పటి నుంచి ఫాం హౌస్ కే పరిమితమయ్యారు.

తెలంగాణ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు నిర్వహించే పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరవుతున్నారు. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు పార్టీ నియోజక ఇన్ చార్జీలు తరలిరానున్నారు. దాదాపు 7 నెలల తరువాత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ నిర్వహిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

Read more RELATED
Recommended to you

Latest news