రేషన్ కార్డు కలిగిన వారికి గుడ్ న్యూస్… ఆ స్కీమ్ గడువు పెంపు..!

మీకు రేషన్ కార్డు వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. మోదీ సర్కార్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఊరటని ఇచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్రం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది.

free ration

 

కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ స్కీమ్‌ను మరింత కాలం ఎక్స్టెండ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో ఉచిత రేషన్ స్కీమ్ బెనిఫిట్స్ ని ఇంకా రేషన్ కార్డు వున్నవాళ్లు పొందొచ్చు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేయడం జరిగింది.

మోదీ సర్కార్ ఉచిత రేషన్ స్కీమ్‌ను 2022 మార్చి నెల వరకు నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని పొడిగించదని నివేదికలు వెలువడ్డాయి. అయితే కేంద్రం మాత్రం ఈ స్కీమ్‌ గడువును ఎక్స్టెండ్ చేసారు.

ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ అన్నా యోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా ఉచిత రేషన్ అందించడం ప్రారంభించారు. తొలిగా ఈ స్కీమ్‌ను 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు అమలు చేశారు. నెక్స్ట్ 2021 నవంబర్ 30 వరకు పొడిగించారు. ఇప్పుడు మరోసారి స్కీమ్ గడువు ఎక్స్‌టెండ్ చేశారు.