బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిన కేంద్రం

-

కేంద్ర ప్రభుత్వం బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. పుట్టిన వెంటంటే పసి కందు పేరు తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్రం సూచించింది. కేంద్రం ఇచ్చే  విత్ నేమ్ సర్టిఫికెట్ వల్ల భవిష్యత్ లో అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. నిజానికి బిడ్డ పుట్టిన 21 రోజుల్లోపే పుట్టినట్టుగా రిజిస్ట్రేషన్ చేస్తారు.

అయితే అనంతరం ఏడాదిలోపు స్థానిక సంస్థల్లో పేరు నమోదు చేసేందుకు గాను ఎలాంటి ఫీజు ఉండదు. 15 ఏళ్ల వరకు రూ.5 ఆలస్య రుసుము తీసుకుంటారు. ఈ కాల వ్యవధి దాటితే ఇక తీసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ప్రస్తుతం ఈ గడువును మరో ఐదేళ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో ఒకరంగా ఇది చాలా ఉపయుక్తంగా మారనుంది. ఈ బర్త్ సర్టిఫికేట్ అనేక చోట్ల గుర్తింపు పత్రంగా ఉండనుంది. 

Read more RELATED
Recommended to you

Latest news