ఉక్రెయిన్ – రష్యా దేశాల యుద్ధం ప్రారంభం అయి నెలలు గడుస్తున్నా.. వివాదం ఇంకా కొలుక్కి రాలేదు. పప్రంచ దేశాలు చాలా వరకు ఉక్రెయిన్ కు అండగా ఉంటున్నాయి. చైనా తో పాటు మరి కొన్ని దేశాలు రష్యాకు బహిరంగంగా మద్దతు తెలుపుతున్నాయి. అయితే ఈ యుద్ధంపై భారత్ మొదటి నుంచి తటస్థ వైఖరితో ఉంటుంది. పార్లమెంట్ లో ఈ యుద్ధంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టిన ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. తాజా గా లోక్ సభలో ఉక్రెయిన్ – రష్యా యుద్ధం గురించి భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు.
ఈ యుద్ధం పై భారత్ ఒక మార్గం ఎంచుకోవాల్సి వస్తే.. తప్పకుండా శాంతి మార్గాన్నే ఎంచుకుంటుందని అన్నారు. ప్రస్తుత కాలంలో సమస్యలు యుద్ధం ద్వారా పరిష్కారం కావని అన్నారు. దౌత్యం వల్లే వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. యూఎన్ఓతో పాటు అంతర్జాతీయ వేదికలపై భారత ప్రభుత్వం ఇదే చెబుతుందని అన్నారు. అలాగే అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అన్నారు.