జగన్ సీమకు సముద్రమే తెచ్చారు.. రోజా ఆసక్తికర ట్వీట్..

-

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి.పాలనా సౌలభ్యం కోసం జిల్లాలను విభజించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.13 జిల్లాల ను 26 జిల్లాలుగా విభజించడంతో చాలా జిల్లాల స్వరూపం మారిపోయింది. గిరిజన, కోస్తా రాయలసీమ జిల్లాల సంఖ్య పెరగడమే కాదు కొత్త హద్దులు కొత్త పాలన అమల్లోకి వచ్చింది.ఒకప్పుడు అతిపెద్ద జిల్లా గా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్న జిల్లాగా  మారింది.అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎవరు ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాదు రాయలసీమ ప్రజలు ఎన్నడూ చూడని మార్పు కనిపించింది. అందులో రాయలసీమ పరిధిలోకి సముద్రతీరం రావడం కూడా ఒకటి. తాజా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతం లోఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం కలిసింది.

అలాగే సముద్రతీరంలో ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గం గూడూరు కూడా తిరుపతి జిల్లాలో చేరింది.దీంతో రాయలసీమ పరిధిలో ఉన్న తిరుపతి జిల్లాకు సముద్రం వచ్చేసిందని చర్చ జరుగుతుంది.రాయలసీమకు సముద్రం రావడంతో ఎమ్మెల్యే రోజా కూడా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాలు ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు ధన్యవాదాలు అన్నారు రోజా.26 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకెళ్లాలి అని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.పునర్వ్యవస్థీకరణలో సీమకు సముద్రం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు ఎమ్మెల్యే రోజా.

Read more RELATED
Recommended to you

Latest news