వెల్ కమ్ ఫ్రెండ్.. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను ఆహ్వానించిన చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌

-

మరికొద్ది గంటల్లో జాబిల్లిపైకి చంద్రయాన్-3 వెళ్లనుంది. యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నవేళ- జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించేందుకు ‘చంద్రయాన్‌-3’లోని విక్రమ్‌ ల్యాండర్‌ రెడీ అవుతోంది. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2019లో చంద్రయాన్‌-2 మిషన్‌లో భాగంగా పంపించిన ఆర్బిటర్‌ ప్రస్తుతం జాబిల్లి చుట్టూ తిరుగుతోంది. తాజాగా ఈ ఆర్బిటర్ తో ‘విక్రమ్‌’ అనుసంధానించినట్లు ఇస్రో వెల్లడించింది.

‘‘‘మిత్రమా.. స్వాగతం! అంటూ విక్రమ్‌కు పాత ఆర్బిటర్‌ స్వాగతం పలికింది. ఆ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి వ్యవస్థ స్థాపితమైంది. ల్యాండర్‌ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్కింగ్‌ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు తెరుచుకున్నట్లయింది’’ అని ఇస్రో ట్వీట్‌ చేసింది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ మిషన్‌ జీవితకాలం ఏడేళ్లని 2019లో ఇస్రో తెలిపిన సంగతి గమనార్హం.

ఇక మరోవైపు.. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ దిగే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం 5:20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది. అన్నీ అనుకూలిస్తే- అదేరోజు సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ల్యాండర్‌ దిగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news