వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ట్రైలర్ వచ్చేసింది. నవ్వుల పూలు పూయించడానికి వచ్చేసింది. జాతి రత్నాలు ఫేమ్ హీరో నవీన్ పొలిశెట్టి – స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమా ట్రైలర్‌ను మూవీమేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. డీసెంట్ కామెడీతో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘రారా కృష్ణయ్య’ ఫేమ్ దర్శకుడు.. మహేశ్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమా ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సినిమాలో హీరో స్టాండప్ కమెడియన్‌గా, హీరోయిన్ ఫేమస్ చెఫ్ పాత్రలో కనిపించనున్నారు. ‘తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్లి ఎందుకు’, ‘అమ్మాయిలకు అబ్బయిలంటే పెద్ద లిస్ట్ ఉంటుంది .. కానీ అబ్బాయిలకు ఇంత లిస్ట్ ఉండదు అమ్మాయి అయితే చాలు బ్రో’, ‘సీసీ కెమెరా ఉంది, వైరల్ అయిపోతాం’ అనే డైలాగులు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.