BREAKING : నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరిన చంద్రయాన్‌ – 3

-

BREAKING : చంద్రయాన్-3 రాకెట్‌ నింగిలోకి ఎగిరింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది చంద్రయాన్‌ – 3 రాకెట్‌. శ్రీహరికోట నుంచి ఎలీవీఎం-3 ఎం4 రాకెట్‌ ప్రయోగాన్ని నింగిలోకి వదిలారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు.

నాలుగేళ్ల కిందట చెదిరిన ‘జాబిల్లి’ కళను తిరిగి సాకారం చేసుకునేందుకు రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. చంద్రుడిపై అన్వేషణకు 2019లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి మెట్టుపై విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశంపై చంద్రయాన్ 3 రాకెట్‌ ను వదిలింది ఇస్రో.

ఈ ఉపగ్రహాన్ని ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో అనుసంధానించారు. సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది. ఆ తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్‌ అవుతుందని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్‌-3 చంద్రుడి దగ్గరకు చేరడానికి 40 రోజుల సమయం పడుతుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news