సీఎం కేసీఆర్ బీసీల ద్రోహి అంటూ మండిపడ్డారు బిజెపి నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. శుక్రవారం బీసీ ఘోష పోస్టర్ అవిస్కరించిన సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. కెసిఆర్ బీసీ ల మీద కక్ష పెంచుకున్నాడని.. అయన DNA లోనే బీసీ వ్యతిరేకత ఉందన్నారు. కెసిఆర్ బీసీలను అష్ట దిగ్బంధనం చేస్తున్నాడన్నారు. తెలంగాణలో 15 లక్షల బీసీ కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయని పేర్కొన్నారు.
బీజేపీ OBC సమ్మేళనానికి భయపడి కెసిఆర్ బీసీలకు లక్ష బిక్ష అనే పథకం పెట్టారని ఆరోపించారు. ఈ లక్ష భిక్ష ప్రోగ్రాం పూర్తి కావాలి అంటే వంద యేళ్లు కావాలన్నారు. ముగ్గురు బీసీ మంత్రులు కెసిఆర్ కోతులని విమర్శించారు. మిగతా మంత్రులకన్నా కెసిఆర్ కు వీళ్ళే ముందు డబ్బా కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు అసలు చీము నెత్తురు లేదన్నారు.