రాష్ట్రంలో మహిళలకు గుర్తింపు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీనే అని అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఐదేళ్లలో తప్పుడు మాటలు చెప్పి అందరినీ నమ్మించారని.. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ నెరవేర్చలేదని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట మార్చాడని మండిపడ్డారు. జగన్ బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదన్నారు.
జగన్ ఫెక్ ముఖ్యమంత్రి.. అబద్ధాల కోరు అంటూ తీవ్ర విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. రాబోయే ఎన్నికల్లో 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. మధ్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఆ తర్వాత మాట మార్చాడని అన్నారు. మరో 160 రోజులలో టిడిపి అధినేత చంద్రబాబు సీఎం అవుతారని చెప్పారు.