చంద్రయాన్‌-3 అప్డేట్.. జాబిల్లి దిశగా ప్రయాణం

-

చంద్రునిపై అన్వేషణ కోసం ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 గురించి మరో కీలక అప్డేట్ తెలిసింది. చంద్రయాన్-3  ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు పడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. 18 రోజుల పాటు భూమి చుట్టూ తన కక్ష్యలను పూర్తి చేసుకున్న చంద్రయాన్‌-3.. తాజాగా చంద్రుడి కక్ష్య వైపు దూసుకెళుతోందని వెల్లడించారు.

ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3 కక్ష్యను పెంచి ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. చంద్రయాన్‌-3 విజయవంతంగా భూమి కక్ష్యలను పూర్తి చేసుకొని చంద్రుడి వైపు వెళ్తోందని.. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్కింగ్‌ కేంద్రంలో పెరీజి-ఫైరింగ్‌ దశ పూర్తయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్‌-3ని ట్రాన్స్‌లూనార్‌ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టామని.. ఇక తదుపరి చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడమేనని పేర్కొన్నారు. ఆగస్టు 5న చంద్రుడి క్షక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. అనుకున్నట్లుగానే అన్ని ప్రక్రియలు సజావుగా జరిగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news