BREAKING : సామాన్యులకు బిగ్ రిలీఫ్..రూ.100 తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

-

ఇవాళ ఆగస్టు ఒకటో తారీకు. ఒకటో తారీకు కావడంతో అనేక ఆర్థిక మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా వివిధ రకాల వస్తువుల ధరలు పెరగవచ్చు లేక తగ్గవచ్చు. ఇలాంటి తరుణంలోనే సామాన్యులకు అదిరిపోయే శుభవార్త చెప్పాలి చమురు కంపెనీలు. తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు.

ఆగస్టు ఒకటో తేదీ కావడంతో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను చమరు కంపెనీలు తగ్గించాయి. వాణిజ్య సిలిండర్ల ధరను ఏకంగా 100 రూపాయలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని అయిన ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర 1680కు చేరింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు చమరు కంపనీలు.

Read more RELATED
Recommended to you

Latest news