రెండు విడతల్లో ఛత్తీస్​గఢ్ ఎన్నికలు.. ఈసారైనా బీజేపీకి ఛాన్స్ దక్కేనా..?

-

భారత్​లో ఈ ఏడాది మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూన్​ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల పోలింగ్, ఫలితాల తేదీలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్​గఢ్​లో ఈ ఏడాది నవంబర్​ 7, 17వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

ఛత్తీస్​గఢ్ ఎన్నికల షెడ్యూల్

తొలి విడత పోలింగ్ తేదీ : నవంబర్ 7

రెండో విడత పోలింగ్ తేదీ : నవంబర్ 17

ఫలితాల తేదీ: డిసెంబర్ 3

మొత్తం ఓటర్లు: 2.03 కోట్లు

2018 ఛత్తీస్​గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (90 సీట్లు)

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్  – 68

భారతీయ జనతా పార్టీ  – 15

జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్  – 5

బహుజన్ సమాజ్ పార్టీ  – 2

ఛత్తీస్​గఢ్​లో 2018లో కాంగ్రెస్ పార్టీ ఘటన విజయం సాధించింది. ప్రస్తుత భూపేశ్​ బఘేల్ ప్రభుత్వం 2024 జనవరి 3 వరకు కొనసాగనుంది. అయితే గత 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎట్టకేలకు సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ తాపత్రయపడుతోంటే.. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ ఇరువురిలో విజయం ఎవరిదో తేలాలంటే మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news