రేపు ఛత్తీస్​గఢ్​లో అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్

-

నక్సల్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్​గఢ్​లో ఇప్పటికే తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం రోజున తుది దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు పోలింగ్​కు రంగం సిద్ధం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా.. ఈనెల 7న 20 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌ జరిగింది. 22 జిల్లాల పరిధిలో ఉన్న మిగతా 70 స్థానాలకు శుక్రవారం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. రెండో విడత పోలింగ్‌ శుక్రవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. అయితే నక్సల్స్‌ ప్రభావిత రాజిమ్‌ జిల్లాలోని బింద్రనవాగఢ్‌ స్థానంలోని 9పోలింగ్‌ బూత్‌ల్లో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది.

రెండో విడత పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం 18వేల 8వందల 33 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. 700 పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం మహిళా ఉద్యోగులే విధులు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పశ్చిమ రాయ్‌పుర్‌ స్థానంలో అత్యధికంగా 26మంది పోటీలో ఉండగా….దౌండిలోహార స్థానంలో అత్యల్పంగా నలుగురు బరిలో ఉన్నారు. రెండో విడతలో 958 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అందులో 827మంది పురుషులు, 130మంది మహిళలు, ఒక ట్రాన్స్‌ జెండర్‌ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news