చాక్లెట్ కలర్ డ్రెస్సులో మిలమిల మెరుస్తున్న ఆలియా

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ సోషల్ మీడియాలో మరోసారి తన ఫొటోలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాక్లెట్ కలర్ షిమ్మర్ డ్రెస్సులో ఆలియా అందం అదిరిపోయింది. టైట్ ఫిట్ డ్రెస్సులో ఆలియా సూపర్ ఫిట్​గా కనిపించింది. రేడియెంట్ స్మైల్​తో మెస్మరైజ్ చేసింది. ఈ ఔట్​ఫిట్​లో ఆలియా కాఫీ విత్ కరణ్​ షోకు హాజరైంది. ఈ షోలో కరీనా కపూర్​తో కలిసి ఆలియా సందడి చేసింది. ప్రస్తుతం ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆలియా అందం రోజురోజుకు పెరిగిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. చాక్లెట్ కలర్ ఔట్​ఫిట్​లో ఆలియా చాక్లెట్​లా చాలా స్వీట్​గా ఉందని కొందరూ.. లేదు లేదు చాలా హాట్​గా ఉందని మరికొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆలియా అందమే కాదు.. నటన కూడా సూపర్ అంటూ ఇంకొందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇక ఆలియా సినీ కెరీర్ గురించి వస్తే.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్​తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ తన వర్సటాలిటీని ప్రేక్షకులకు చూపెట్టింది. నటనలో మేటి అని నిరూపించుకుంటూ డిఫరెంట్ కాన్సెప్ట్స్​తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇటీవలే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news