కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోరాగర్ జిల్లాలో ర్యాలం అనే గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ప్రతికూల వాతావరణ కారణంగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజీకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆది కైలేశ్ వైపు వెళ్తోంది. ఉత్తరాఖండ్ డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దాండే కూడా ఆయన వెంటే ఉన్నారు. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో హెలికాప్టర్‌ను మున్సియారిలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఇదిలా ఉండగా.. ఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ అక్టోబర్ 15న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒకేదశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా జార్ఖండ్‌లో నవంబర్ 13, 20న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు.