పాకిస్థాన్ దొంగ దెబ్బ. మళ్లీ కాల్పులు ప్రారంభించింది పాకిస్థాన్. ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాక్. శ్రీ నగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అక్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్‌తో దాడులు చేస్తోంది పాకిస్థాన్. మరోవైపు, శ్రీనగర్‌లో బ్లాక్ ఔట్ కొనసాగుతోంది. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఘాటు ట్వీట్ చేశారు.

అయితే వక్ర బుద్ధి పోనిచ్చుకోని పాకిస్థాన్ కు ఇండియా చుక్కలు చూపిస్తోంది. కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇండియా. స్ట్రాంగ్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టిన భారత్.. పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. బార్డర్‌లో దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వం.. పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది.