నరేంద్ర మోదీ అంటే నమ్మించి మోసం చేయడమే : రేవంత్ రెడ్డి

-

నరేంద్ర మోదీ అంటేనే నమ్మించి మోసం చేయడం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నల్లధనం వెనక్కి రప్పించి జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, ఎవరికైనా ఆ నగదు వచ్చిందా అని ప్రశ్నించారు. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో భాగంగా బెంగళూరులో నిర్వహించిన ప్రచారంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీకి… వారిని కాల్చి చంపినందుకు ఓటు వేయాలా? అని నిలదీశారు.

“కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపి నేతలను ఒక్కటే అడుగుతున్నా. యడ్యూరప్ప మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్. ఆయన కొడుకు విజయేంద్ర కర్ణాటక పార్టీ అధ్యక్షుడు. ఇంకో కొడుకు రాఘవేంద్ర ఇప్పుడు పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ… గోపీనాథ్ ముండే ఇద్దరు కూతుళ్లు ఎంపీలు. రాజ్ నాథ్ సింగ్ కేంద్ర మంత్రి.. ఆయన కొడుకు ఎమ్మెల్యే. మీ పార్టీలో ఉన్నోళ్లంతా చేసేవి కుటుంబ రాజకీయాలే.. మీరా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడేది?” అంటూ మోదీపై, బీజేపీపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version