నూతన సంవత్సరంలో తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 69,515 కోట్లకు పెంపు పెంచినట్లు చెప్పారు. అలాగే ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 800 కోట్లు కేటాయించారు. అయితే సాంకేతికతను ఉపయోగించి త్వరితగతిన రైతుల పంటలకు పంట బీమా చెల్లింపు విధానానికి తోడ్పడనుంది ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ.
అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద లబ్ధి పొందుతున్నారు నాలుగు కోట్ల మంది రైతులు. ఇక 1350 రూపాయలకే 50 కిలోల డీఏపి బస్తా ఇవ్వడానికి సిద్ధమై.. డీఏపీ ఎరువులపై అదనపు భారం కేంద్రం భరించాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి డీఏపీ ఎరువుల సబ్సిడీకి 3850 కోట్లు కేటాయించారు. 2014-24 వరకు ఎరువుల సబ్సిడీకి 11.9 లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. 2024 లో మూడోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కోసం 6 లక్షల కోట్లతో 23 కీలక నిర్ణయాలు తీసుకుంది.