మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. తలనొప్పిగా మారిన సీఎంల ఎంపిక

-

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజేపీ హైకమాండ్ తలలు పట్టుకుంటోంది. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్‌ నుంచి కైవసం చేసుకున్న బీజేపీకి ఈ రాష్ట్రాల్లో వసుంధర రాజె, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రమణ్‌ సింగ్‌ బలమైన నేతలుగా ఉన్నారు. ఇప్పుడు వారిని కాదని కొత్త వారిని ఎంపిక చేయాలనుకున్న బీజేపీ హైకమాండ్​కు తలనొప్పి మొదలైంది. ముఖ్యమంత్రి అభ్యర్థులను ఇప్పటికే మోదీ, అమిత్‌ షా ఎంపిక చేశారని, నామమాత్రంగా పరిశీలకులను ఆయా రాష్ట్రాలకు పంపించారనే వాదనా ఉన్నా పేర్లను వెల్లడించడానికి పార్టీ ముందుకు రావడం లేదు.

రాజస్థాన్‌లో వసుంధర రాజె రూపంలో బీజేపీకి పెద్ద అడ్డంకి ఎదురవుతోంది. మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆమె లాబీయింగ్‌ చేస్తుండగా..బీజేపీ అధిష్ఠానం ఆమెకు ఇవ్వాలని అనుకోవడం లేదు. అయితే తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారేమోనన్న అనుమానం అధిష్ఠానంలో ఉంది. కాంగ్రెస్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ కూడా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లే కనిపిస్తుండగా వసుంధర రాజెకున్న అసాధారణ బలాన్నీ బీజేపీ విస్మరించలేని పరిస్థితిలో ఉంది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news