25 మిలియన్‌లకు చేరిన సీఎం యోగీ ఫాలోవర్లు

-

రోజురోజుకీ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ పాపులారిటీ పెరిగిపోతోంది. పరిపాలనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మాఫీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మహిళల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్న యోగీ సంక్షేమ పథకాల్లో వారికే పెద్దపీట వేస్తున్నారు. అలాగే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అటు రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టిన యోగీ……వారు పోటీ పడి పంటలు సాగు చేసే వాతావరణాన్ని నెలకొల్పారు. దీంతో అన్ని వర్గాలకు సీఎం యోగీ మరింతగా చేరువ అవుతున్నారు.

వివిధ వర్గాలను ఆకట్టుకుంటూ జనరంజక పాలన సాగిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సోషల్ మీడియాలో పాపులారిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది.ట్విట్టర్‌లో ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 25 మిలియన్లు దాటింది. ఆయనకు సోషల్ మీడియాలో పాపులారిటీ నిరంతరం పెరుగుతోంది. ట్విట్టర్‌లో అతని ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్లకు చేరగా రెండోసారి ముఖ్యమత్రి అయితన తరువాత మరింత మంది ఫాలోవర్లు వచ్చారని ట్విట్టర్‌ వర్గాల నుంచి అందిన సమాచారం.సీఎం యోగి తన అధికారిక @myogiadityanath అనే ఖాతాను 2015 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పట్లో ఎంపీగా ఉన్నారాయన. 2017లో తొలిసారిగా యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాపులారిటీ ఎంత స్పీడ్‌గా పెరిగిందో, సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కూడా అంతే వేగంగా పెరుగుతున్నారు.

ట్విట్టర్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లు

ఎనిమిదేళ్లలో యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 25 మిలియన్లకు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తర్వాత బీజేపీ అగ్రనేతల్లో యోగికి మాత్రమే ట్విట్టర్‌లో ఇంత పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. సిఎం యోగి ఇంటర్నెట్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో చాలా కమ్యూనికేట్ చేస్తారు. ట్విట్టర్‌తో పాటు, అతను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు దేశీయ ఇంటర్నెట్ మీడియా యాప్ కులో కూడా చురుకుగా ఉన్నారు. యోగీ సుపరిపాలన నేపథ్యంలో ఈ ఏడాది మరింత మంది ఫాలోవర్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version