భారతదేశంలోని పలు కంపెనీలు జీతాలను తిరిగి పునరుద్ధరిస్తున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. దీపావళి బోనస్ లు ఈ కంపెనాలు అందిస్తున్నాయి. దేశంలోని పలు ఐటి కంపెనీలు ఉద్యోగుల జీతాలను నెమ్మదిగా పునరుద్ధరిస్తున్నాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు, చాలా కంపెనీలు ఉద్యోగులకు దీపావళి బోనస్‌లు ఇవ్వడం ద్వారా పండుగ సీజన్ లో కాస్త ఉపశమనం కల్పిస్తున్నాయి.
వోల్టాస్, విజయ్ సేల్స్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు దీపావళి బోనస్ లను ఇప్పటికే ఇచ్చాయని జాతీయ మీడియా పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన హైడ్రోకార్బన్స్ విభాగాల కోసం పనిచేసే ఉద్యోగుల జీతాలను తిరిగి ఇస్తున్నామని గతంలో ప్రకటన చేసింది. ముందస్తుగా 30 శాతం చెల్లింపులు చేస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పుడు సంవత్సరానికి రూ .25 లక్షలకు పైగా సంపాదించే ఉన్నతాధికారులకు తిరిగి మళ్ళీ అదే వేతనాలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది.