ధరల పెరుగుదలపై కాంగ్రెస్ కి ప్రశ్నించే హక్కు లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగుళూరులో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో దేశంలో ద్రవయోల్బణం తీరును ప్రస్తావించారు. తమ ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని.. ధరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ధరలు తగ్గించేందుకు 2014 నుండి మోడీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక బజరంగ్దళ్ వంటి సంస్థలను నిషేధించాలని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాదనపై ఆమె సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మూర్ఖత్వానికి ఉదాహరణ అని అన్నారు. మేము ఎల్లప్పుడూ బజరంగ్ బలి ని గౌరవిస్తామని.. హనుమాన్ చాలీసా ను పటిస్తామన్నారు. కర్ణాటక హనుమాన్ జి జన్మస్థలం అని చెప్పుకొచ్చారు.