త్వరలో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో.. నిరుద్యోగులకే అత్యంత ప్రాధాన్యం

-

రానున్న లోక్సభ ఎన్నికలకు ప్రపధాన పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్లు పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రవేశపెట్టే మేనిఫెస్టోపై కసరత్తు చేస్తోంది. ఈ మేనిఫెస్టోపై తాజాగా చర్చించిన పార్టీ ఇందులో నిరుద్యోగ సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా అప్రెంటీస్‌షిప్‌ ప్రోగ్రాం సహా మరికొన్ని వినూత్న కార్యాచరణలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీకి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం సారథ్యం వహిస్తుండగా.. ఈ కమిటీలో సభ్యులుగా ప్రియాంకా గాంధీ వాద్రా, శశి థరూర్‌, ఆనంద్‌ శర్మ సహా మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నారు. వీరంతా సమావేశమై మేనిఫెస్టోపై అంతర్గత చర్చలను ముగించారు. ఈ ఎన్నికల ప్రణాళిక కమిటీ 50 పేజీల నివేదికను పార్టీ అధిష్ఠానానికి సమర్పించనుండగా కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) తుది ఆమోదం తెలపనుంది.

Read more RELATED
Recommended to you

Latest news