కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు కోరుతూ అధినాయకత్వానికి లేఖ రాసిన 23 మంది నేతల లిస్టులో ఎంపీ శశి థరూర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎంపీ కొడికున్నిల్ సురేష్ ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శశి థరూర్ రాజకీయ నాయకుడు కాదని, ఆయన ‘గెస్ట్ ఆర్టిస్టు’ అంటూ సురేశ్ విమర్శించారు. పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ హితవు పలికారు.
తానేదో గ్లోబల్ సిటిజిన్ అన్నట్టుగా పార్టీకి భిన్నమైన వైఖరిని ప్రదర్శించడం సరికాదు’ అని సురేష్ వ్యాఖ్యానించారు. కాగా, సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల లిస్టులో గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, మనీశ్ తివారి, జితిన్ ప్రసాద, శశి థరూర్ తదితర 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు. దీంతో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తాత్కాలిక చీఫ్గా సోనియా గాంధీ కొనసాగాలని తీర్మానించింది.