రాహుల్ జోడో యాత్ర భద్రతపై తమకు సందేహాలు ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు కర్గే…. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. యాత్ర అస్సాంలోకి ప్రవేశించినప్పటి నుంచి భద్రత తగ్గించాలని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు పదేపదే దాడికి పాల్పడుతున్నారని, కాంగ్రెస్ పోస్టర్లు చించి వేస్తున్నారని పేర్కొన్నారు. కొందరు రాహుల్ గాంధీ కాన్వాయిడ్ దగ్గర వరకు వచ్చారని, అయినా ఒక్కరిని అరెస్టు చేయలేదని షా దృష్టికి తీసుకెళ్లారు.
కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీసహా ఇతర నేతలపై అస్సాం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు పాల్పడటంతో వారిపై కేసు నమోదయినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీతో పాటు, కె.సి.వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీఎం బిశ్వశర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.