రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 5వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ !

-

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా ప్రకటన చేయాలని కసరత్తు చేస్తుంది.

Notification for 5000 teacher jobs soon

ఇప్పటికే విద్యాశాఖ ఖాళీల లెక్కలు సేకరించింది గతేడాది 5,089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవగా మరో 5వేల పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే పాత నోటిఫికేషన్‌కు సుమారు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వాలని యోచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version