సామాన్యులకు శుభవార్త.. త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ వినియోగదారులకు ఇచ్చే రాయితీని కేంద్రం రూ. 100 కు పెంచింది. దీంతో మొత్తం రాయితీ రూ. 300 కు చేరగా… ఇకపై వారికి రూ. 603కే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.
దీని ద్వారా 9.6 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. తాము అధికారంలోకి వస్తే రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం తెలిసిందే. కాగా, తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, జాతీయ పసుపు బోర్డుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్. అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కూడా ఆమోదం తెలిపింది. ఏపీ-తెలంగాణ మధ్య నీటిని కేటాయించాలని కేంద్రం ఆదేశించింది. ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించాలని ఆదేశించింది కేంద్ర కేబినెట్. అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కూడా ఆమోదం తెలిపింది.