దేశంలో కరోనా వైరస్ అలజడి రోజు రోజుకు పెరుగుతుంది. ఇటీవల 400 మంది పార్లమెంట్ సిబ్బంది కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజా గా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లో కరోనా అలజడి సృష్టించింది. ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. అంటే సుప్రీం కోర్టులో ఉన్న మొత్తం సిబ్బందిలో దాదాపు 5 శాతం మందికి కరోనా సోకింది. కాగ సుప్రీం కోర్టు లో మొత్తం 3000 కు పైగా సిబ్బంది ఉంటారు.
అయితే ఇప్పుడు అక్కడ కరోనా వైరస్ వెలుగు చూడటంతో న్యాయ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. సుప్రీం కోర్టులో పాజటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో సుప్రీం కోర్టు లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సుప్రీం కోర్టు పాలన అధికారులు తెలిపారు. కాగ కరోనా వ్యాప్తి కారణంగా ఈ నెల 3 నుంచే కేసుల విచారణలు అన్నీ కూడా వర్చువల్ పద్దతీలోనే జరుపుతున్నారు. కాగ వైరస్ సోకిన 150 మంది లో నలుగురు జడ్జీలు కూడా ఉన్నారు.