ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా తాజా లెక్క‌లివే..

-

భార‌త్‌లో కొత్త‌గా 83,347 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కేసుల సంఖ్య 5,646,010కు పెరిగింది. ఒక్క‌రోజులో 1,085మంది మ‌ర‌ణించ‌గా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం మరణాల సంఖ్య 90,020కు చేరుకుంది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 968,377 ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,587,613మంది కోలుకున్నారు. కాగా, అత్య‌ధికంగా మహారాష్ట్రలో 1,242,770 కరోనావైరస్ కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 625,514, తమిళనాడులో 547,337, కర్ణాటకలో 533,850, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 364,543 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

ఇదిలా ఉండ‌గా.. కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు అత్యంత ప్రభావిత ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులతో ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు ఈ స‌మావేశంలో పాల్గొన‌నున్నారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 31,764,198కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 23,371,496 మంది కోలుకోగా, 974,559 మంది మరణించారు. అత్యధికంగా 7,097,598 కేసులు. ఇండియాలో 5,640,496, బ్రెజిల్ 4,595,335, రష్యాలో 1,115,810 కేసులు న‌మోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version