2 ఏళ్లు పైబ‌డిన పిల్ల‌ల‌కు సెప్టెంబ‌ర్ వ‌ర‌కు కోవాగ్జిన్ టీకా: ఎయిమ్స్ చీఫ్ వెల్ల‌డి

కరోనా నేప‌థ్యంలో 18 ఏళ్ల‌కు పైబ‌డిన వారికే ప్ర‌స్తుతం టీకాల‌ను వేస్తున్నారు. అంత‌క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న‌వారితోపాటు పిల్ల‌ల‌కు టీకాల‌ను ఇవ్వ‌డం లేదు. అయితే కోవిడ్ మూడో వేవ్ వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో పిల్ల‌ల‌కు కూడా టీకాల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప‌లు వ్యాక్సిన్ త‌యారీ కంపెనీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అందులో భాగంగానే కోవాగ్జిన్ ఉత్ప‌త్తిదారు భార‌త్ బ‌యోటెక్ పిల్ల‌ల‌పై కోవిడ్ టీకా ట్ర‌య‌ల్స్‌ను ఇప్ప‌టికే ప్రారంభించింది.

అయితే చిన్నారుల‌కు కోవిడ్ టీకాలు సెప్టెంబ‌ర్ నెల‌లో అందుబాటులోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా తెలిపారు. సెప్టెంబ‌ర్ వ‌ర‌కు చిన్నారుల‌కు కోవాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ డేటా (2/3) ల‌భిస్తుందని, దీంతో అదే నెల‌లో ఆ టీకాకు అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. కాగా గులేరియా కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్‌లో స‌భ్యుడిగా ఉన్నారు.

ఇక ఫైజ‌ర్‌, బ‌యో ఎన్‌టెక్‌కు చెందిన టీకాకుకు కూడా అనుమ‌తులు ల‌భిస్తే సెప్టెంబ‌ర్‌లో ఈ వ్యాక్సిన్ కూడా పిల్ల‌ల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు. కాగా జూన్ 7వ తేదీ నుంచి కోవాగ్జిన్ పిల్ల‌ల టీకా ట్ర‌య‌ల్స్ ప్రారంభం అయ్యాయి. 2 నుంచి 17 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారికి ట్ర‌య‌ల్స్‌లో భాగంగా టీకాల‌ను ఇస్తున్నారు. టీకాకు చెందిన ఫేజ్ 2 ట్ర‌య‌ల్స్ డేటా సెప్టెంబ‌ర్ వ‌ర‌కు అందుబాటులోకి వేస్తే అప్ప‌టికి ఈ వ్యాక్సిన్‌కు అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ల‌భించిన‌ట్లు అవుతుంది. అదే జ‌రిగితే దేశంలో పిల్ల‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చిన తొలి కోవిడ్ టీకాగా కోవాగ్జిన్ నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.