జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభం : తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

-

జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు వివరణ ఇచ్చారు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని హైకోర్టు ప్రశ్నించగా… రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా సమాధానం ఇచ్చారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని..ఆన్ లైన్ బోధన కూడా కొనసాగుతుందని సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు.

విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలన్నారు. అయితే… పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని అభిప్రాయ పడింది హైకోర్టు. హైకోర్టు అభిప్రాయాన్నీ దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామని పేర్కొన్నారు సుల్తానియా. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా…ఈ నెల 19 న జరిగిన సమావేశంలో జులై 1 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని తెలంగాణ కేబినేట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news