ఇక గుండె పదిలం.. కేంద్రం ఆధ్వర్యంలో 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్

-

పదేళ్ల వయసున్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువత ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఫిట్​గా ఉన్న వారు కూడా హార్ట్ అటాక్​కు గురవుతున్నారు. అయితే గుండెపోటుకు గురైన వారికి సమయానికి సీపీఆర్ అందిస్తే బతికే అవకాశం ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

గుండెపోటు మరణాలు తగ్గించేందుకు చర్యలు ప్రారంచిన కేంద్ర సర్కార్.. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సీపీఆర్‌ టెక్నిక్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇవాళ ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అమలు కానున్న ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 10 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుందని చెప్పారు. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news