సామాన్యులకు షాక్..9 ఏళ్లలో రూ.745 పెరిగిన సిలిండర్ ధర

-

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాక్. గృహ అవసరాలకు వినియోగించే LPG సిలిండర్ ధరను చమురు సంస్థలు ఒకేసారి రూ. 50 పెంచాయి. 2014లో రూ. 410 గా ఉన్న ధర, 9 ఏళ్లలో ఏకంగా రూ.745 పెరిగి రూ.1,155కు చేరింది.

కమర్షియల్ సిలిండర్ ధర కూడా మరో రూ.350 కి పెంచడంతో రూ. 2,325 కు చేరింది. ఈ నేపథ్యంలో హోటళ్లలో ఫుడ్ ధరలు పెంచక తప్పదని చిరు వ్యాపారాలు అంటున్నారు. చివరగా ప్రజలపైనే భారీ భారం పడనుంది. దీంతో విపక్షాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.

గ్యాస్ సిలిండర్ పై నో స‌బ్సిడి

  • UPA 10 ఏండ్లలో..గ్యాస్ పై 2.14 లక్షల కోట్ల సబ్సిడీ..అందుకే 410/- కె సిలిండర్
  • మోడి హాయంలో గ్యాస్ పై సబ్సిడీ 40 వేల కోట్ల లోపే..అందుకే 1155/- కు చేరిన సిలిండర్
  • నాలుగు ఏండ్లలో 22 వేల కోట్ల నుంచి 200 కోట్లకు గ్యాస్ సబ్సిడీ పడి పోయింది
  • 2019-20 లో గ్యాస్ స‌బ్సిడి- 22,726 కోట్లు
  • 2020-21 లో స‌బ్సిడి- 3658 కోట్లు
  • 2021-22 లో స‌బ్సిడి- 242 కోట్లు.
  • 2023-24 లో స‌బ్సిడి- 180 కోట్లు (బడ్జెట్ కేటాయింపులు)

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version