సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు

-

ఇవాళ సెప్టెంబర్ ఒకటో తేదీ. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఆయిల్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. ఎల్పిజి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. ఎల్పిజి పంతొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా 91.5 రూపాయలకు తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటన చేశాయి. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరలను కంపెనీలు సవరిస్తూ ఉంటాయి.

gas cylinder

ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయిల్ కంపెనీలు ధరలను సవరించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా 1885 రూపాయలకు చేరింది. ఇది హైదరాబాద్లో 2099.5 రూపాయలు కాగా విజయవాడలో 2034 రూపాయలకు చేరింది. వైజాగ్ లో 1953 రూపాయలుగా నమోదు అయింది. 14.2 కేజీల గృహవసరాలు మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు ఆయిల్ కంపెనీలు. దీంతో వారికి నిరాశే మిగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version