దిల్లీ అల్లర్లకు కారణం ‘దీప్‌సిధు’నా..?

-

నూతన చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజు రైతన్నలు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఎర్రకోటపై రైతన్నలు ఎగరవేసిన జెండాతో దిల్లీ దద్దరిల్లిపోయింది. అయితే.. విద్రోహ శక్తులు తమ ర్యాలీలో చొరబడి అల్లర్లు సృష్టించాలరని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో పంజాబీ నటుడు సింగర్‌ ‘దీప్‌సిధు’ అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఉద్రిక్త పరిస్థితులకు అతడే కారణమని భావించిన పోలీసులు అతడికి నోటీసులు సైతం జారీ చేసినట్లు సమాచారం.

ఎవరతను.. ?

పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన దీప్‌సిధు పంజాబీ, హింది సినిమాల్లో నటించాడు. దిల్లి సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతన్నలకు సిధు సంఘీభావం ప్రకటిస్తునే ఉన్నారు. రెండ్రోజుల క్రితం దిల్లి వచ్చిన ఆయన రైతన్నలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కిసాన్‌ మోర్చా పరేడ్‌లో కూడా సిధు ఉన్నారు.

అనుమానాలు ఎక్కువే..

గణతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న పరిణామాలకు దీప్‌సిధునే కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రెచ్చగొట్టడంతోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ‘ మా ఉద్యమాన్ని కించపరిచేందుకు కొన్ని దుష్టశక్తులు మా ఉద్యమంలో చొరబడ్డాయి. ఎర్రకోటపై జెండాలు ఎగరేయడం మా ప్రణాళికలో అస్సలే లేదు. ప్రధానితో దీప్‌సిధు దిగిన ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మాకు సిధుపైనే అనుమానాలు ఉన్నాయి’ అని రైతలు సంఘాల నేతల్లో ఒకరైన ఎస్‌ఎస్‌ పందేర్‌ పేర్కొన్నారు.

దీప్‌సిధు సిక్కు కాదు..

‘‘దీప్‌సిధు సిక్కు కాదు. ఆయన బీజేపీ కార్యకర్త. మేము చేస్తున్నది రైతుల ఉద్యమం బారికేడ్ల ధ్వంసం ఉద్రిక్తత వాతవరణం సృష్టించడం మా ఉద్యమంలో లేదు. అదంతా సంఘ విద్రోహుల పని’’ అంటు భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ తికాయత్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సిధును తాము మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నామని.. ఘటన సమయంలో ఆయన ఎర్రకోట వద్దనే ఉన్నారని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ ఓ టీవీ షోలో తెలిపారు. ర్యాలీకి ఒకరోజు ముందు సిధు రైతులనను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు.

సిధు ఖండన..

దిల్ల అల్లర్లలో తనపై వస్తున్న ఆరోపణలను సిధు ఖండించారు. ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత సిధు ఓ వీడియో విడుదల చేశారు. ‘ అంతమంది రైతులను ఎర్రకోటకు వెళ్లేలా నేను ఎలా ప్రోత్సహించగలను.? ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తున్నట్లు ఒక్క వీడియో కూడా లేదు’ అని సోషల్‌ మీడియాలో ఓ సందేశం పంపారు.

Read more RELATED
Recommended to you

Latest news