IPL 2023 : ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది బెంగళూరు. ఆర్సిబితో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. గెలిచిన, ఓడిన ప్లే ఆఫ్ చేరే అవకాశం లేకపోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ధనాదన్ షాట్లతో స్వేచ్ఛగా ఆడారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా బాగానే ఆడింది.
డూప్లెసెస్, కోహ్లీ, లోమ్రోర్ చక్కగా బ్యాటింగ్ చేశారు. వీళ్ళు ముగ్గురు రాణించడంతో నిర్నిత 20 ఓవర్లలో ఈ జట్టు 181 పరుగులు చేసింది. బౌలర్లకు మంచి సహకారం లభిస్తున్న పిచ్ పై ఈ స్కోరు చాలా ఎక్కువే అని నిపుణులు కూడా అన్నారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ ఢిల్లీ బ్యాటర్లు తొలి బంతి నుంచే ఎదురు దాడికి దిగారు. సిరాజ్, హజిల్ వుడ్, హసరంగ, హర్షల్ పటేల్ ఇలా ఎంతమంది బౌలర్లు మారినా సరే వాళ్ళ దూకుడు మాత్రం తగ్గలేదు. ఇక అటు ఢిల్లీ బ్యాటర్లు.. దాటిగా ఆడటంతో.. ఢిల్లీ చేతిలో చిత్తుగా ఓడింది బెంగళూరు.