సీబీఐ కస్టడీకి దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం అనుమతించింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

తిహాడ్‌ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చి ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కేసులో ట్రయిల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై దిల్లీ హైకోర్టు స్టే విధించింది.

మరోవైపు గతంలో దిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. దిల్లీ హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేసినందున తిరిగి సమగ్ర వివరాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news