ఢిల్లీ హైకోర్టు: కౌమార దశలో ప్రేమని కంట్రోల్ చేయలేము… కోర్టులు జాగ్రత్తగా ఉండాలి..!

-

కౌమార దశలో ప్రేమని కోర్టులు కంట్రోల్ చేయలేదని జడ్జిలు కూడా వాళ్ళ ప్రేమని కంట్రోల్ చేయలేరని దరఖాస్తులను విచారించేటప్పుడు న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని.. అటువంటి సమయంలో బెయిల్ దరఖాస్తులను విచారిస్తున్నప్పుడు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఏప్రిల్ 2021 లో 16 ఏళ్ల అమ్మాయి 19 ఏళ్ల అబ్బాయితో వెళ్లిపోయింది. బెయిల్ పిటిషన్ ని విచారిస్తున్నప్పుడు మే 8న కోర్టు పరిశీలన చేయగా ఆ అమ్మాయి మైనర్ అవ్వడంతో ఆ అబ్బాయి మీద అత్యాచారం కేసు నమోదు అయింది.

చాలామంది టీనేజర్స్ రొమాంటిక్ కల్చర్ల ని సినిమాలు నవలలలో చూసి నేర్చుకుంటున్నారని వయసు చట్టాల గురించి వాళ్ళకి తెలియదని జస్టిస్ స్వర్ణకాంత శర్మ అన్నారు. యుక్త వయసులో ప్రేమ గురించి యుక్త వయసు వాళ్ళు సినిమాల్లో ఉన్నట్టు ఉంటుందని అనుకుంటున్నారు అయితే నిజ జీవితం వేరు. అయితే ఇక్కడ ఉన్న ప్రాసిక్యూట్రిక్స్ నిందితుల హృదయాలకు సంబంధించి విషయంలో తప్పు చెయ్యచ్చు.

అయితే టీనేజ్ సైకాలజీ మరియు యుక్త వయసు ప్రేమను కోర్టులు నియంత్రించలేవు అయితే అలాంటప్పుడు న్యాయమూర్తులు కేసులని తిరస్కరించేటప్పుడు లేదంటే బెయిల్ మంజూరు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. ప్రతి కేసులో వాస్తవాలు గురించి అక్కడ పరిస్థితుల గురించి తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళ ప్రేమ పట్ల వైఖరిని పరిశీలించాలని కోర్టు గమనించాలన్నారు. అయితే ఈ కేసులో చూస్తున్నట్లయితే ఈ అమ్మాయి తనకి ఇష్టమైన అబ్బాయి తోనే వెళ్లిపోయింది.

విచారణలో బాలిక ఏడు వారాల గర్భవతి అని పోలీసులు కనుగొన్నారు. ప్రెగ్నెన్సీ మెడికల్ టర్మినేషన్ కండక్ట్ చేశారు. డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఆ అబ్బాయి అని వచ్చింది. వీళ్ళ పెళ్లి నిశ్చయించుబడింది. జస్టిస్ శర్మ రెండు నెలలు పాటు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఏది ఏమైనా ఆ అమ్మాయి తనకి ఇష్టం వుండే అబ్బాయి దగ్గరకి వెళ్లిందని కోర్టు పేర్కొంది. సిఆర్‌పిసి సెక్షన్‌లు 161 మరియు 164 కింద బాలిక తన వాంగ్మూలంలో స్థిరంగా పేర్కొన్నట్లు కోర్టులో నమోదైన వాంగ్మూలంలో ఆమె ఇష్టానుసారం వెళ్లినట్లు కోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version